16.9.14

శ్రీ జయ నామ సంవత్సర శరన్నవరాత్రి కలశ స్థాపన కాల నిర్ణయము

శ్రీ జయ నామ సంవత్సర శరన్నవరాత్రి కలశ స్థాపన కాల నిర్ణయము_ యల్.యస్. సిద్ధాన్తి
Sri jaya nama samvatsara sharannavaratri (devi navaratri) kalasha sthapana nirnayam _ L S Siddhanthy

9.9.14

శ్రీ జయ నామ సంవత్సర మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము_LSSIDDHANTHY

శ్రీ జయ నామ సంవత్సర మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము

మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము హైద్రాబాద్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, తిరుపతి, ఒంగోలు ప్రాంతములకు విడివిడిగా అపరాహ్ణకాలముల వివరణ
ప్రాతస్సంగవ మధ్యాహ్ణ అపరాహ్ణో స్సాయమిత్యపి । ప్రదోషస్సంగవ నిశీ బ్రాహ్మీ అరుణోదయమిత్యపి ॥
పగటి సమయ కాలములు- ప్రాతఃకాలము, సంగవ కాలము, మధ్యాహ్ణ కాలము, అపరాహ్ణ కాలము, సాయం కాలములు
రాత్రి సమయ కాలములు- ప్రదోష కాలము, సంగవ కాలము, నిశీ కాలము, బ్రాహ్మీ కాలము, అరుణోదయ కాలములు
ఏ కాలములో చేయవలసిన కార్యక్రమములు ఆ కాలము లో చేయవలయును శ్రాధము ఎప్పుడైనా శ్రాద్ధకాలము లోనే చేయవలయును కానీ ప్రస్తుతము ౧౧ లేదా ౧౨ గంటలకే చేస్తున్నారు అది శాస్త్ర విరుద్ధం
శ్రాద్ధకర్మ కరిష్యే అనే మాట ఎప్పుడంటున్నరు శ్రాద్ధకాలములోనా లేక మధ్యాహ్ణ కాలములోనా అదికూడా ప్రధానమే. కర్మకు ఉద్యుక్తుడవుతున్నాడంటే తప్పనిసరిగా ఆ సమయములో ఆ శ్రాద్ధకాలము ఉండాలి
శ్రాద్ధకర్మ తను సంకల్పించు సమయమునుండీ అపరాహ్ణకాలము ఉండాలి
మధ్యాహ్ణకాలములో సంకల్పించి అపరాహ్ణకాలములో చేయడము సరికాదు__L S SIDDHANTHY
శ్రీ జయ నామ సంవత్సర మహాలయ పక్ష శ్రాద్ధ నిర్ణయము_LSSIDDHANTHY








5.9.14

శ్రీ మన్మథ నామ సంవత్సర కాల నిర్ణయ పంచాంగమ్


శ్రీ మన్మథ నామ సంవత్సర కాల నిర్ణయ పంచాంగమ్
Sri manmatha nama samvatsara kalanirnaya panchangam

godavari pushkaramulapai pratyeka vivarana tho & devalaya vastu ku sambandhinchina pramana shlokamulatho kudina pratyeka vyasam & prapanchavyapthamuga 2015-2016 lo darshanamagui grahanamula vivaranatho marenno sapramana vishayamulatho Sri manmatha nama samvatsara kalanirnaya panchangam
jaganmatha & jagadguruvula anugrahamutho twaralo avishkarinchabotunnanu

"గోదావరి పుష్కరముల" పై ప్రత్యేక వివరణ & "దేవాలయ వాస్తు" కు సంబంధించిన ప్రమాణ శ్లోకములతో కూడిన ప్రత్యేక వ్యాసం & ప్రపంచవ్యాప్తంగా ౨౦౧౫-౨౦౧౬ లో దర్శనమగు గ్రహణములవివరణతో, మరెన్నో సప్రమాణ విషయములతో "శ్రీ మన్మథ నామసంవత్సర కాలనిర్ణయ పంచాంగం" జగన్మాత అనుగ్రహముతో జగద్గురువుల ఆశీస్సులతో త్వరలో ఆవిష్కరించబోతున్నాను.
L.S.SIDDHANTHY —

"ప్రకృతిని కాపాడుదాం" - "పరమాత్మ అనుగ్రహం పొందుదాం" "అదృష్ట వృక్షములు"

వర్షఋతువు పూర్తి అయ్యే ౧౫ రోజుల ముందునుండీ రెండునెలల కాలము "యమదంష్ట్ర కాలం" (రోగవృద్ధి కాలం) అని అంటారు.
ఇట్టి సమయమందు వారి వారి జన్మనక్షత్రముల రీత్యా అదృష్ట వృక్షములను నాటినా, పెంచినా, ఆరాధించినా తద్దోషములు తొలగి సర్వులూ & సమాజమూ రోగబాధలు లేక సుభిక్షముగా ఉండునని శాస్త్రవచనం. (అందుకే వర్షఋతువులో వచ్చే విఘ్నేశ్వర స్వామి పూజలో అనేక వృక్షజాతుల దళములతో, ఫలములతో ఆరాధించడము అనాదిగా జరుగుతున్నది).
జన్మ నక్షత్రములు తెలిసినవారు జన్మ నక్షత్రముల రీత్యా లేదా పిలిచే పేరులోని మొదటి అక్షరముల రీత్యా అదృష్టవృక్షములను నాటండి ప్రకృతి అనుగ్రహం పొందండి.
"ప్రకృతియే పరమాత్మ"
"ప్రకృతిని కాపాడుదాం" - "పరమాత్మ అనుగ్రహం పొందుదాం"
॥లోకాస్సమస్తా స్సుఖినోభవంతు॥
(విష్ణు & అగ్ని పురాణం)
యల్.యస్.సిద్ధాన్తి

గణపతి వైభవం

గణపతి వైభవం




8.8.14

Sri manmatha nama samvatsara panchanga sadassu 2015-2016 Sri kalanirnaya panchangam_kanchi kaamakothi petham

Sri manmatha nama samvatsara panchanga sadassu 2015-2016 Sri kalanirnaya panchangam_kanchi kaamakothi petham
పంచాంగ పండిత విద్వత్సభ (2015-2016) - కంచి

చాలా సంతోషకరమైన విషయం
శ్రీశ్రీశ్రీ కంచి పరమాచార్యులవారి దివ్య ఆదేశము మేరకు సుమారు 110 సంవత్సరములనుండి ప్రతి సంవత్సరము జరుగు పంచాంగ పండిత విద్వత్సభకు భారతదేశము లోని ప్రముఖ స్థలముల నుండి పంచాంగ కర్తలను & పండితులను ఆహ్వానించి వారందరికి ఒక వేదిక ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలూ లేకుండా అందరూ ఒకేరకముగా పండుగలు & పర్వదినములు నిర్ణయించాలి అని తీర్మానించడం జరిగినది

వచ్చే మన్మథ నామసంవత్సర (2015-2016) పంచాంగ విషయములు, పండుగల నిర్ణయ నిమిత్తం
మొట్టమొదటి సారిగా తెలుగు పంచాంగకర్తగా అధికారికముగా యల్.సుబ్రహ్మణ్య సిద్ధాన్తి ని పిలవడం జరిగినది.

ఇట్టి సభలో పంచాంగ కర్తలు, ఖగోళశాస్త్ర పండితులు, వేదపండితులు, సంస్కృత, వ్యాకరణ, తర్క, మీమాంస, న్యాయ శాస్త్ర పండితులు పాల్గొనిరి.
తమిలనాడు, శ్రీరంగం, కంచి, మధురై, కుమ్బకోణం, రామేశ్వరం దేవస్థాన పంచాంగకర్తలు, కేరళ, మైసూర్, కలకత్త, ముంబాయి, ఢిల్లి ప్రాంత పంచాంగకర్తలు నేను పాల్గొనడం జరిగినది.

04-08-2014 నుండి 06-08-2014 వరకు సభ జరిగినది.

ఈ సభ యందు ధృవీకరించిన విషయములు & నేను గణించిన శ్రీ కాలనిర్ణయ పంచాంగములోని పండుగలు, పర్వదినములు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ గణితములు, "గోదావరీ పుష్కర" నిర్ణయ, మౌఢ్య, గ్రహణ నిర్ణయ విషయములు ఒకేరీతిగా సశాస్త్రీయముగా ఉన్నవి అని సభా ఆమోదము పొందటము జరిగినది.

దానిని ధృవీకరిస్తూ శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామివారు & శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు అధికారికముగా వారి "శ్రీముఖము" ను అందజేయటము జరిగినది.

sri jagadguru kanchi paramacharya swami vari divya adeshamu meraku sri manmatha nama samvatsara panchanga vidvatsabha
sabha yandu panchanga, siddhantha, samskrutha, vyakarana, tarka nyaya, memamsa, dharma shastra, veda panditulu palgoni ekagrevakamuga pandugalanu nirdharinchiri














http://lssiddhanthy.blogspot.in/2014/08/sri-manmatha-nama-samvatsara-panchanga.html

26.2.14

లింగోద్భవ కాల నిర్ణయం


శ్రీ విజయ నామ సంవత్సర మహాశివరాత్రి లింగోద్భవ కాల నిర్ణయం _ls siddhanthy

8.1.14

సంక్రాంతి కాల నిర్ణయం, makar sankranti 2014 date 15-01-2014

సంక్రాతి సందేహ నివారణ 


శ్లో॥ మాందైక కర్మేన శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: ।
శ్రాద్ధాదీషు పరిగ్రాహ్యా గ్రహణాదౌతు బీజయుక్ ॥ ॥ తిథి కౌస్తుభం ॥

శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ వ్రతాది: కాల ఉచ్యతే ।
దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ ॥ సిద్ధాంత రహస్యం ॥

నిత్య నైమిత్తిక కర్మలకు, వ్రతములకు, పండుగలకు,శ్రాద కర్మలకు తిథిని నిర్ణయించుట యందు దృక్ కలపకుండా పూర్వ పద్దతి ప్రాకారమే (మహర్షి ప్రోక్తమైనది, సూర్య సిద్దాంత ఉక్తమైన పద్దతి, సంప్రదాయ పద్దతి ప్రకారమే) ఆచరించవలయును.

గ్రహణాదులయందు, జాతక ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన గ్రహములను తీసుకోవలనని మన శాస్త్రములు, సిద్ధాంత గ్రంధములు, మన పూర్వీకులు తెలియ పరచిరి .

సంక్రాంతి పండుగను పూర్వ పద్దతి ప్రకారమే ఆచరించుట సర్వదా శ్రేయోదాయకము.

పూర్వ పద్దతి ప్రకారము శ్రీ సూర్యభగవానుడు 14-01-2014 న సాయంత్రం 6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు.
సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.

ధర్మ శాస్త్ర నిర్ణయముననుసరించి 15-01-2014 ననే సంక్రాంతి ఆచరించవలయును.

సుబ్రహ్మణ్య సిద్ధాంతి



2014 Calander by Lssiddhanthy