21.1.14

2014-15 SRI JAYA NAMA SAMVATSARA UGADI CALANDER_by L.SUBRHMANYA SIDDHANTHY

8.1.14

సంక్రాంతి కాల నిర్ణయం, makar sankranti 2014 date 15-01-2014

సంక్రాతి సందేహ నివారణ 


శ్లో॥ మాందైక కర్మేన శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: ।
శ్రాద్ధాదీషు పరిగ్రాహ్యా గ్రహణాదౌతు బీజయుక్ ॥ ॥ తిథి కౌస్తుభం ॥

శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ వ్రతాది: కాల ఉచ్యతే ।
దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ ॥ సిద్ధాంత రహస్యం ॥

నిత్య నైమిత్తిక కర్మలకు, వ్రతములకు, పండుగలకు,శ్రాద కర్మలకు తిథిని నిర్ణయించుట యందు దృక్ కలపకుండా పూర్వ పద్దతి ప్రాకారమే (మహర్షి ప్రోక్తమైనది, సూర్య సిద్దాంత ఉక్తమైన పద్దతి, సంప్రదాయ పద్దతి ప్రకారమే) ఆచరించవలయును.

గ్రహణాదులయందు, జాతక ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన గ్రహములను తీసుకోవలనని మన శాస్త్రములు, సిద్ధాంత గ్రంధములు, మన పూర్వీకులు తెలియ పరచిరి .

సంక్రాంతి పండుగను పూర్వ పద్దతి ప్రకారమే ఆచరించుట సర్వదా శ్రేయోదాయకము.

పూర్వ పద్దతి ప్రకారము శ్రీ సూర్యభగవానుడు 14-01-2014 న సాయంత్రం 6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు.
సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.

ధర్మ శాస్త్ర నిర్ణయముననుసరించి 15-01-2014 ననే సంక్రాంతి ఆచరించవలయును.

సుబ్రహ్మణ్య సిద్ధాంతి



2014 Calander by Lssiddhanthy