26.8.12

Graha Snchara Vivaramulu

సూర్యసిద్ధాంత రీత్యా శ్రీ నందన నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య శుక్రవారం ది.వి.17-08-2012 రోజున ఉదయం 8-13 నిమిషములకు శ్రీసూర్యభగవానుదు మిశ్రయను నామధేయము కలవాడై మేష వాహనారూఢుడై సింహరాశిలో ప్రవేశించుచున్నాడు. 
సింహ సంక్రమణ పుణ్యకాలం

:- 17-08-2012 న ఉదయం 8-13 నుండి మధ్యాహ్నం 2-37 వరకు.

ఈ పుణ్యకాలంలో చదువవలసిన శ్లోకం:- 

శారికా వాహనారూఢం ఖడ్గఖేటలసత్కరం |
నభోమాస నమావ్యద్యక్తేశా నామపనుత్తయే ||


  • సింహ సంక్రమణ పురుషుదు శంఖ స్నానము చేయుటవలన శుభము.
  • పర్ణ(ఆకుల)వస్త్రము ధరించుట వలన శుభము.
  • కృష్ణాగరుగంధలేపనము చేసుకొనుటవలన సుగంధములకు ధరలు పెరుగును.
  • పాటలీపుష్పము ధరించుటచే ఆధికారులకు ప్రాణభయము.
  • సువర్ణ ఉంగరము ధరించుటచే లోహములకు ధరలు పెరుగును.
  • వెదురు పాత్రయందు తేనె తాగుటవలన గొడవలు పెరుగును.
  • ఖర్జూర తాంబూల సేవనం చేయుటవలన ధాన్యములకు ధరలు పెరుగును.
  • అంకుశమను ఆయుధము ధరించుటచే గజములకు హాని కలుగును.
  • ఊర్ద్వముఖుడగుతచే కూరగాయలకు వెలలు పెరుగును.

ఈవిధముగా మన పూర్వీకులు గ్రహ గమనముననుసరించి ఫలితములు చెప్పెడివారు. దొషములు తొలగుతకు గోసేవ చేయుట,వృక్ష సేవ చేయుట ఎరుపు వస్త్రములు దానము చేయుట వలన షుభము చేకూరును.
ఆశ్రేషా, మఖా, స్వతీ నక్షత్రముల ఈ నెల (17-08-2012 నుంది 17-09-2012 వరకు) వారు జాగ్రత్త వహించగలరు.
శుభం శ్రీమాతృ ఆనుగ్రహ సిద్ధిరస్తు.






No comments:

Post a Comment